కడపలో బుధవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ఈ మేరకు కడప నగరంలో ప్రవహిస్తున్న బుగ్గవంక ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఒకవేళ భారీ వర్షాలు కురిసి బుగ్గవంక ప్రాజెక్టు గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి వస్తే.. పరివాహక ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు అక్కడ ఇసుక బస్తాలను ఏర్పాటు చేశారు.
కడప నగర కమిషనర్ రంగస్వామి పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. అక్కడ జరుగుతున్న భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల ప్రజలకు సూచించారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని కమిషనర్ ఆదేశించారు. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే 08562-254199, 08562-254188 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల..
వర్షాలకు వెలిగల్లు, పింఛా, బుగ్గవంక, అన్నమయ్య ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. దీంతో అధికారులు ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేశారు. వెలిగల్లు ప్రాజెక్టు నుంచి 450 క్యూసెక్కులు, పింఛా ప్రాజెక్టు నుంచి 7703 క్యూసెక్కులు, ప్రాజెక్టు నుంచి 7703 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు.
ఇదీ చదవండి: