కడప జిల్లా బద్వేలులో ఇసుక డిపోలో ఉన్నత అధికారులు తనిఖీలు చేపట్టారు. జంగాలపల్లి, బుడ్డాయిపల్లి రీచ్‌లో రవాణా చేసిన ఇసుక బద్వేలు డిపోలో రాకుండానే బయటకు తరలించినట్లు అధికారులు గుర్తించారు. రికార్డులను పరిశీలించి 3,999 మెట్రిక్ టన్నులు ఇసుక అక్రమంగా తరలించినట్లు తేల్చారు. అక్రమార్కులను గుర్తించి చర్యలు తీసుకోనున్నట్లు తనిఖీ చేసిన అధికారి జాన్ వెల్లడించారు.
ఇదీ చూడండి