ETV Bharat / state

'అటవీ భూమిని రక్షించలేని అధికారులపై వేటు తప్పదు' - మైదుకూరు అటవీ ప్రాంతంపై వార్తలు

మైదుకూరు నియోజకవర్గంలో వంద ఎకరాల అటవీ భూమిని రక్షించలేని అధికారులపై వేటు తప్పదని తెదేపా నేత పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. ఆక్రమణలపై సమగ్ర వివరాలు సమర్పించాలని రాష్ట్ర అటవీశాఖ ఉన్నతాధికారులకు జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు.

putta sudhaker yadhaw on forest lands at maidhukuru
పుట్టా సుధాకర్ యాదవ్
author img

By

Published : Oct 16, 2020, 7:15 PM IST

కడపజిల్లా మైదుకూరు నియోజకవర్గంలో వంద ఎకరాల అటవీ భూమి ఆక్రమణలకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెదేపా నేత పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. ఆక్రమణలపై సమగ్ర వివరాలు సమర్పించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్... రాష్ట్ర అటవీశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఈ విషయంపై చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేస్తే.. ఈనెల 12న ఉత్తర్వులు ఇచ్చిందని సుధాకర్ యాదవ్ గుర్తు చేశారు.

రాష్ట్ర అటవీశాఖ అధికారికి, జిల్లా కలెక్టర్, తహసీల్దార్​ను బాధ్యులన చేస్తూ ఆదేశాలు ఇవ్వడమే కాకుండా... నవంబర్ 23వ తేదీ లోపు సమగ్ర వివరాలు కోర్టు ముందుంచాలని ఉత్తర్వులిచ్చినట్లు పుట్టా సుధాకర్ వెల్లడించారు. మైదుకూరు నియోజకవర్గంలో వంద ఎకరాల అటవీ భూమిని రక్షించలేని అధికారులపై వేటు తప్పదని పుట్టా సుధాకర్ అన్నారు.

ఇదీ చదవండి:

డోర్ డెలివరీ వాహనాల్లో రూ. 63 కోట్లు ఆదా: పౌరసరఫరాల శాఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.