కడప జిల్లా సింహాద్రిపురం మండలం చవ్వావారి పల్లి గ్రామ ప్రజలు రెండు రోజులుగా కొండచిలువ వలన భయంతో గడిపారు. గ్రామ పొలాల్లో సంచరిస్తూ కోడి పిల్లలు, మేక పిల్లలు, కుందేళ్లను తింటూ.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పాములు పట్టే.. రాజా అనే వ్యక్తికి అధికారులు కొండ చిలువను పట్టుకోవాలని చెప్పారు. దాని జాడను కనుక్కొని పట్టుకున్నాడు రాజా. అప్పటికే అది కుందేళును మింగేసింది. తర్వాత కొండ చిలువను అడవిలోకి తీసుకెళ్లి విడిచిపెట్టడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి:తిరుమల నడకదారిలో... ఏడడుగుల నాగుపాము !