ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరుతూ... కడపలో ఏ.ఐ.టీ.యూ.సీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. బ్యాంకు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బ్యాంకులో ఇటీవల చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఈ అంశం గురించి బ్యాంకు ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లినా... పట్టించుకోలేదన్నారు. పొరుగు సేవల ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు.
ఇదీ చదవండి: