కరోనా వ్యాప్తి నియంత్రణపై సీఎం జగన్ దృష్టి పెట్టకుండా తెదేపా నాయకులపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని తెదేపా రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి అన్నారు. కొత్త వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు నాయుడు సూచించారే గానీ.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయలేదని పేర్కొన్నారు. అయినప్పటికీ... చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇలాంటి కేసులకు తెదేపా ఎప్పటికీ భయపడదని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందించాలని కోరుతూ కడపలో తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. టీకాల కోసం కేంద్రం నిధులను మంజూరు చేసినప్పటికీ... వాటిని ముఖ్యమంత్రి వేరే పథకాలకు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం కరోనా మరణాలపై వ్యవహరిస్తున్న వైఖరికి నిరసనగా కమలాపురం తెదేపా కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. రాష్ట్రంలో కరోనా రోగులకు సరైన వైద్య చికిత్స అందించడం లేదని ఆరోపించారు. తగినన్ని బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్స్, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కొరత, ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: