అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలో యువతిని హత్య చేసిన వ్యక్తిని ఉరితీయాలని ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు ఎం.రాజా డిమాండ్ చేశారు. హత్యను ఖండిస్తూ కడపలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. దళితులపై రోజురోజుకూ అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
దళితుల ఓట్లతో గద్దెనెక్కిన సీఎం జగన్.. వారిపై దాడులను పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్రంలో దిశా చట్టం అమల్లో ఉందా లేదా అని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దిశ చట్టాన్ని పకడ్బంధీగా అమలు చేయాలని కోరారు.