రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు బేడీలు వేసినందుకు కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రవీణ్ కుమార్ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన పోలీసులను విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని ప్రవీణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
రాజధానిని మూడు ముక్కలు చేయాలనుకోవడం సిగ్గు చేటని తెలిపారు. అమరావతిలో వేల కోట్ల ల్యాండ్ మాఫియా జరిగిందని ఆరోపిస్తున్న వైకాపా నాయకులు... అవి వాస్తవమైతే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. స్థానిక తహసీల్దార్ నజీర్ అహ్మద్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఇదీ చదవండి: