భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై.. కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందించారు. ప్రొద్దుటూరులో తెదేపా నేత నందం సుబ్బయ్య హత్య కేసులో ఎమ్మెల్యే ప్రమేయం ఉందని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. దీంతోపాటు రాజుపాలెం మండలం అయ్యవారిపల్లెలో ఇటీవల జరిగిన ఇరువర్గాల ఘర్షణ, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ బెదిరింపు కాల్స్‌లో ఎమ్మెల్యే పాత్ర ఉందని ఆరోపణలు చేశారు. అవన్నీ అవాస్తవమైతే కాణిపాకంలో ఎమ్మెల్యే ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రాచమల్లు.. విష్ణువర్ధన్ రెడ్డి సవాల్ స్వీకరిస్తున్నట్లు తెలిపారు. కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ప్రమాణానికి సిద్ధమని ఎమ్మెల్యే రాచమల్లు ప్రకటించడంతో భాజపా నేత విష్ణువర్ధన్‌రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
ఇదీ చదవండి:
payyavula keshav: 'బయటపెట్టిన అంశాలు కొన్నే.. ఇంకా పెద్ద ఆర్థిక ఉల్లంఘనలు జరిగాయ్..'