ETV Bharat / state

కడప కేంద్ర కారాగారానికి ప్రొద్దుటూరు టీడీపీ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి! అరెస్టును ఖండించిన లోకేశ్​ - టీడీపీ నేత శ్రీనివాసులు రెడ్డి

Proddatur TDP Leader Praveen Arrest: తనపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని ప్రొద్దుటూరు టీడీపీ ఇంచార్జ్​ ఆరోపించారు. తనకు సంబంధం లేని అంశమని స్పష్టం చేశారు. ఆయనపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​ స్పందించారు.

proddatur_tdp_leader_praveen_arrest
proddatur_tdp_leader_praveen_arrest
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2023, 10:39 PM IST

Proddatur TDP Leader Praveen Arrest: ప్రోద్దుటూరులో వైసీపీ కార్యకర్తపై దాడికి తనకు ఎలాంటీ సంబంధం లేదని ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్​ ప్రవీణ్​ కుమార్​ రెడ్డి తేల్చి చెప్పారు. ఆ దాడి జరిగిన రోజు పోలీసుల నియంత్రణలో ఉన్నట్లు వివరణ ఇచ్చారు. దాడి సమయంలో కొగొంట గ్రామంలో ఉన్నానని.. తనపై ఉద్దేశపూర్వకంగానే హత్యాయత్నం కేసు నమోదు చేశారని ఆయన తెలిపారు. బెనర్జీకి టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడని.. అతను ఓ మహిళను వేధించాడని ఆరోపించారు. బాధిత మహిళ.. భరత్​ రెడ్డి అనే తన అనుచరుడికి వేధింపుల గురించి వివరించినట్లు.. ప్రవీణ్​ కుమార్​ వివరించారు. ఈ క్రమంలో భరత్​కు, బెనర్జీకి మధ్య వివాదం జరిగిందని అన్నారు. ఈ క్రమంలోనే బెనర్జీపై భరత్​ అనుకోకుండా దాడి చేసినట్లు తెలిపారు. దాడి ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

అయితే ప్రవీణ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి కడప కేంద్ర కారాగారంకు తరలించారు. సోమవారం ఉదయం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సాయంత్రం మెజిస్ట్రేట్​ ముందు హాజరు పరిచారు. ఆయనకు 14 రోజుల రిమాండ్​ విధించగా.. సోమవారం రాత్రి కడప కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ క్రమంలో ప్రవీణ్​ కుమార్​ను కలవడానికి వచ్చిన టీడీపీ నేతలను పోలీసులు అనుమతించలేదు.

ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌ఛార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అరెస్టు - ఇంట్లో ప్రెస్​మీట్ నిర్వహిస్తుండగా పోలీసుల ఎంట్రీ

అరెస్టును ఖండించిన లోకేశ్​: ప్రవీణ్‍కుమార్ రెడ్డిని తప్పుడు కేసులో ఇరికించారని.. అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ తెలిపారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రవీణ్ కుమార్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని మండిపడ్డారు. ఇదే ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.. బీసీ నేత నందం సుబ్బయ్యని అత్యంత దారుణంగా హత్య చేస్తే కేసు ఎందుకు నమోదు చేయలేదని ఆరోపించారు. సుబ్బయ్యని చంపించింది ఎమ్మెల్యే బామ్మర్ది బంగారు రెడ్డి అని.. పోలీసులకు తెలిసినా చర్యలు తీసుకోలేదని విమర్శలు చేశారు.

ప్రవీణ్​ కుమార్​ రెడ్డి అరెస్టును టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి ఖండించారు. వైసీపీ కార్యకర్త బెనర్జీపై జరిగిన దాడి ఘటనతో సంబంధం లేకపోయినా ప్రవీణ్ రెడ్డిపై హత్యయత్నం కేసు నమోదు చేయడం దారుణమని అన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డికి భయం పట్టుకుందని.. ఆయన ప్రోద్బలంతోనే పోలీసులు ఇష్టం వచ్చినట్లు కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులు టీడీపీ నేతలను ఏమి చేయాలేవని ధీమా వ్యక్తం చేశారు.

YCP MLA Rachamallu Daughter Married Mechanic Son: ఎమ్మెల్యే కుమార్తె ప్రేమ వివాహం.. దగ్గరుండి జరిపించిన రాచమల్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.