యురేనియం తవ్వకాలను విస్తరించేందుకు భారత యురేనియం సంస్థ(యుసీఐఎల్) సన్నాహాలు చేస్తోంది. కడప జిల్లా వేముల మండల పరిధిలోని ఎం.తుమ్మలపల్లె సమీపంలో యుసీఐఎల్ 2007లో రూ.1104.6కోట్ల వ్యయంతో తవ్వకాలు చేపట్టి రోజుకు 3వేల టన్నుల ముడి యురేనియం వెలికితీస్తూ శుద్ధి చేస్తోంది. శుద్ధికి సరిపడా ముడి యురేనియం ఉత్పత్తి కాకపోవడంతో విస్తరణకు 2011నుంచి ప్రయత్నిస్తోంది. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో మూడు విడతలుగా ప్రజాభిప్రాయ సేకరణ వాయిదాపడింది. మరోసారి కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జనవరి 6న ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. రూ.720కోట్ల వ్యయంతో 9.0లక్షల టీపీఏ నుంచి 13.5లక్షల టీపీఏ వరకు యురేనియం గని విస్తరణకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆదివారం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇదీ చదవండి:
ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో ఆసుపత్రులకు పోటెత్తుతున్న బాధితులు