మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజా చైతన్య యాత్రకు మద్దతుగా కడప జిల్లా మైదుకూరులో ప్రజా చైతన్య యాత్రను నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ బాధ్యుడు పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో నాలుగు రోడ్ల కూడలి నుంచి పెద్దమ్మ వీధి మీదుగా ఓంశాంతి నగర్ వరకు యాత్ర కొనసాగింది. వైకాపా ప్రభుత్వం ప్రజలను దగా చేస్తోందని విమర్శలు గుప్పించారు. 45 ఏళ్లకే పింఛన్లు మంజూరు చేస్తామని ఇవ్వలేక పోయారని ఎద్దేవా చేశారు. ఇసుక కొరతను సృష్టించి భవన నిర్మాణ కార్మికులకు ఇబ్బందులకు గురిచేశారని దుయ్యబట్టారు. ఆర్టీసీ బస్సు చార్జీలు, విద్యుత్ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి...