కడప జిల్లా యర్రగుంట్ల వద్ద నున్న రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ)లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఆర్టీపీపీలోని ఆరు యూనిట్లలో 1650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. బొగ్గు నిల్వలు లేని కారణంగా ఉత్పత్తి నిలిపివేసినట్లు ఆర్టీపీసీ సీఈ మోహన్ రావు తెలిపారు.
ఒడిశా నుంచి రావాల్సిన బొగ్గు రవాణా ఆగిపోవడం కారణంగా ఉత్పత్తి నిలిపివేశారు. గత ఏడాది మార్చిలో కరోనా కారణంగా ఏడాదిపాటు ఉత్పత్తి నిలిపేశారు. రెండు నెలల కిందటే తిరిగి విద్యుదుత్పత్తిని పున ప్రారంభించారు. ప్రస్తుతం బొగ్గు నిల్వలు లేకపోవడంతో మరోసారి విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియజేసినట్లు సీఈ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: