RTPP: రాయలసీమ తాప విద్యుదుత్పత్తి కేంద్రం (ఆర్టీపీపీ)లో మొత్తం ఆరు యూనిట్లను ఉత్పత్తిలోకి తీసుకున్నట్లు.. అధికారులు శనివారం వెల్లడించారు. నెల్లూరు దామోదరం సంజీవయ్య తాప విద్యుదుత్పత్తి కేంద్రంలో 800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న యూనిట్‌లో సమస్యలతో ఉత్పత్తిని నిలిపివేయడంతో.. ప్రత్యామ్నాయంగా వైఎస్సార్ జిల్లా ఆర్టీపీపీలోని 5వ యూనిట్‌ను సర్వీస్‌లోకి తీసుకున్నట్లు వివరించారు.
దామోదరం సంజీవయ్య విద్యుత్ కేంద్రంలో నిలిచిపోయిన యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభమైన వెంటనే.. ఆర్టీపీపీలో ఒక యూనిట్‌లో ఉత్పత్తి నిలిపివేసే అవకాశం ఉన్నట్లు వివరించారు. ఆర్టీపీపీలో ప్రస్తుతం దాదాపు 47 వేల మెట్రిక్ టన్నులు బొగ్గు అందుబాటులో ఉందని.. అన్ని యూనిట్లలో విద్యుదుత్పత్తికి సరిపడా బొగ్గు లేదని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: