ETV Bharat / state

అచ్చన్న హత్యకు నిరసనగా టీడీపీ ర్యాలీ... అడ్డుకున్న పోలీసులు

DD Achchenna Murder Case: కడప పశుసంవర్ధక శాఖ ఉద్యోగి అచ్చన్న హత్య కేసు విచారణ జరిపించాలని... కడపలో అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పలువురు నాయకులను గృహ నిర్బంధం చేసి... టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు చేశారు. కాగా, పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Apr 8, 2023, 5:02 PM IST

DD Achchenna Murder Case: వైఎస్ఆర్ కడప జిల్లాలో పశుసంవర్ధక శాఖ ఉద్యోగి అచ్చన్న హత్య కేసు విచారణ జరిపించాలని... కడపలో అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పలువురు నాయకులను గృహ నిర్బంధం చేసి... టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు చేశారు.

అచ్చన్న హత్యకు నిరసనగా నిర్వహిస్తున్న ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

డాక్టర్ అచ్చన్న హత్యకు నిరసనగా కడపలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్ట్​లు, గృహనిర్బంధాలు చేపట్టారు. పోలీసుల తీరుపై ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిరసన కార్యక్రమానికి బయల్దేరిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీలు వ్యవహరిస్తున్న తీరుపై శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డాడు.

వైఎస్ఆర్ కడప జిల్లాలోని పోలీసులతో పాటుగా అధికారులకు జగన్మోహన్ రెడ్డి తన జేబులోనుంచి జీతాలు ఇస్తున్నట్లుగా పోలీసులు, అధికారులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో కనీసం వాక్ స్వాతంత్రం కూడా లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. కడప పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ అచ్చన్న హత్యకు నిరసనగా కడపలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు ముందస్తుగానే అడ్డుకున్నారు. అఖిలపక్ష పార్టీ నాయకులను గృహనిర్బంధం చేసి వారిని బయటికి రానికుండా చేశారు. అందులో భాగంగా శ్రీనివాస్ రెడ్డి తన కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లారు.

ఒక దళితుడైన ఉన్నత స్థాయి అధికారి చనిపోతే స్పందించలేని పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఆయన హత్యకు నిరసనగా... ర్యాలీలు కూడా చేయనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి తన కనుసన్నల్లో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పాలన ఎంతో కాలం ఉండదనే అంశాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకోవాలని విమర్శించారు. కనీసం ఇంట్లో నుంచి బయటికి కూడా రానీకుండా పోలీసులు ఎక్కడికి అక్కడే అఖిలపక్ష పార్టీ నాయకులను నిర్బంధం చేయడం తగదని శ్రీనివాస్ రెడ్డి ఖండించారు.

'రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేయాలన్నా పోలీసులు కాలం చెల్లిన చట్టాన్ని ముందుకు తీసుకువస్తున్నారు. మాట్లాడితే చాలు హౌజ్ అరెస్ట్ అరెస్ట్ చేస్తన్నారు. వైసీపీ ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి తీసుకువస్తుంది. ఒక దళిత అధికారి మిస్ అయిన 14రోజుల తరువాత చనిపోయినట్లు నిర్ధారించారు. వైసీపీ ప్రభుత్వం పోలీసులు, అధికారులను ప్రతిపక్షాలపై వ్యతిరేకంగా వాడుకుంటుంది. ఈ రాష్ట్రంలో సీఎం జగన్ తన స్వంత రాజ్యాంగం అమలు చేస్తున్నట్లు కనిపిస్తుంది.- శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.