కడప జిల్లా రైల్వే కోడూరులో పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లకు పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు, ముస్లిం జేఏసీ భారీ ర్యాలీ నిర్వహించారు. 150 అడుగులు జాతీయ జెండాను చేతపట్టి వీర జవాన్లకు జోహార్లు అర్పించారు. అనంతరం టోల్గేట్ వద్ద అమర జవాన్లకు నివాళులు అర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు.