ETV Bharat / state

కడపలో శివారులో వాహన తనిఖీలు.. రశీదు లేని 987 బంగారు ముక్కుపుడకలు స్వాధీనం - కడప తాజా వార్తలు

కడపలో ఎలాంటి రశీదులేని 987 బంగారు ముక్కుపుడకలకు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మున్సిపల్​ ఎన్నికల కారణంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకే వీటిని తీసుకెళ్తున్నట్లు విచారణలో తేలింది.

Police seized
కడపలో రశీదులేని 987 బంగారు ముక్కుపుడకలు స్వాధీనం..
author img

By

Published : Mar 5, 2021, 5:16 PM IST

కడప శివారులోని అలంఖాన్​పల్లి కూడలి వద్ద వాహనాల తనిఖీలో.. 987 బంగారు ముక్కుపుడకలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల దృష్ట్యా పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఓ కారును ఆపి తనిఖీ చేయగా.. అందులో ఎలాంటి రశీదు లేని 987 ముక్కు పుడకలు లభించాయి. రశీదులు లేకపోవటంతో పోలీసులు వాటిని జప్తు చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకే వీటిని తీసుకెళ్తున్నట్లు విచారణలో తేలింది.

ఈ విషయంపై నయుం, ఆలీ అనే ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరిలో ఒకరు ఓ ఉర్దూ ఛానల్​లో కెమెరామ్యాన్​గా పని చేస్తున్నారు.

ఇదీ చదవండీ.. దారుణం: సోదరికి కట్నం ఎక్కువ ఇస్తున్నారని.. తల్లిని చంపేశాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.