మాజీ మంత్రి, వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంలో... రక్తపు మరకలతో ఉన్న ఓ లేఖ కీలకంగా మారింది. తనపై దాడి జరిగిన అనంతరం వివేకానే ఈ లేఖ రాసినట్టు ప్రచారం జరుగుతోంది.
''నా డ్రైవరు నేను డ్యూటీకి తొందరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు. ఈ లెటర్ రాసేసరికి చాలా కష్టపడ్డాను. డ్రైవర్ ప్రసాద్‌ను వదిలిపెట్టొద్దు. ఇట్లు.. వివేకానందరెడ్డి''... అని ఆ లేఖలో రాసి ఉంది.
దర్యాప్తులో భాగంగా ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. లేఖలో ఉన్నట్టు.. వివేకాను డ్రైవరే చంపాడా.. లేక వాస్తవాలను పక్కదారి పట్టించేదిశగా ఎవరైనా ఇలా చేశారా? అన్నది పరిశీలిస్తున్నారు.