ETV Bharat / state

ఎర్ర చందనం బడా స్మగ్లర్లపై పోలీసు శాఖ దృష్టి - ఎర్రచందనం రవాణాపై పోలీసుల దృష్టి వార్తలు

ఎర్రచందనం చెట్లను తెగనరికి విదేశాలకు అక్రమంగా రవాణ చేస్తూ.. కోట్ల రూపాయల ధనాన్ని బడా స్మగ్లర్లు వెనకేసుకుంటున్నారు. కొందరు పోలీసు, అటవీశాఖ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బడా స్మగ్లర్లు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. తమిళ కూలీలు, స్థానికంగా ఉన్న ముఠాల సాయంతో బడా స్మగ్లర్లు చేతికి మట్టి అంటకుండానే అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. కడప జిల్లా పోలీసు రికార్డుల్లో మాత్రం గతంలో దాదాపు 50 మంది బడా స్మగ్లర్లు ఎర్రచందనం కొల్లగొట్టి విదేశాలకు తరలించినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. బాషాభాయ్ అరెస్ట్ కావడంతో పోలీసుశాఖ బడా స్మగ్లర్లపై దృష్టి సారించింది.

ఎర్రచందనం బడా స్మగ్లర్లపై పోలీసు శాఖ దృష్టి

author img

By

Published : Nov 11, 2020, 7:27 PM IST

కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని శేషాచలం కొండల్లో విస్తారంగా ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. నాలుగు జిల్లాలో దాదాపు 5 లక్షల హెక్టార్లలో ఎర్రచందనం ఉండగా... ఒక్క కడప జిల్లాలోనే 3.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఎర్రచందనం ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అత్యధికంగా కడప జిల్లాలోనే ఎర్రచందనం విస్తరించి ఉండటంతో బడా స్మగ్లర్ల దృష్టి ఇక్కడే ఎక్కువగా ఉంటోంది. నాలుగు జిల్లాల్లో బడా స్మగ్లర్లతో పాటు తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, దిల్లీ, చైనా ప్రాంతాలకు అంతర్జాతీయ స్మగ్లర్లు ఎర్రచందనం అక్రమ రవాణ చేస్తున్నారు. అడవిలో చెట్లను కొట్టడానికి తమిళ కూలీలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అధిక మొత్తంలో డబ్బు ముట్టజెప్పడంతో కూలీలు కూడా ఆశతో ఎర్రచందనం చెట్లు నరకడానికి ముందుకు వస్తున్నారు.

ఆ దుంగలకు చాలా డిమాండ్

ఎర్రచందనం దుంగలను మొదటిరకం, రెండో రకం, మూడోరకంగా విభజించి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు బడా స్మగ్లర్లు. మొదటిరకం ఎర్రచందనం దుంగలకు అంతర్జాతీయ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. నాణ్యమైన మొదటిరకం ఎర్రచందనం దుంగలు అంతర్జాతీయ మార్కెట్ లో టన్ను కోటి రూపాయలు పైగానే పలుకుతోంది. గతంలో ఈ-వేలం కింద ప్రభుత్వం ఎర్రచందనం దుంగలు విక్రయించగా... టన్ను కోటి రూపాయలు పైగానే ధర పలికాయి. ఇంత పెద్ద మొత్తంలో ధర ఉండటంతోనే బడా స్మగ్లర్లు ఎంత కష్టమైనా సరే ఎర్రచందనాన్ని అడవుల నుంచి తరలించడానికి సాహసిస్తున్నారు. కొందరు పోలీసు, అటవీశాఖ సిబ్బంది సహకారంతో జిల్లా సరిహద్దులు దాటుతోందనే విమర్శలు ఉన్నాయి. ఇందులో భాగంగానే బడా స్మగ్లర్ల ఆదేశాలను తూ.చ తప్పకుండా పాటించేందుకు ఆయా జిల్లాల్లో లోకల్ హైజాక్ గ్యాంగ్ లు పుట్టుకొస్తున్నాయి.

నిల్వచేసి తరలిస్తున్నారు

పోలీసులకు, అటవీశాఖ సిబ్బందికి పట్టుబడుతున్నవి కొంతవరకే ఉండగా.. తరలిపోతోంది మాత్రం ఎక్కువే ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాల్లో ఉన్న స్మగ్లర్ల నుంచి ఇతర రాష్ట్రాల్లో మకాం వేసిన అంతర్జాతీయ స్మగ్లర్లు ఎర్రచందనాన్ని కొనుగోలు చేసి చైనా వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎర్రచందనానికి చైనాలో మంచి డిమాండు ఉండటంతో అక్కడికే ఎక్కువగా ఎగుమతి అవుతోంది. ఇక్కడినుంచి తరలించిన ఎర్రచందనం దుంగలను బెంగళూరు, తమిళనాడు, రాజస్థాన్ ప్రాంతాల్లోని గోదాముల్లో నిల్వచేసి అక్కడి నుంచి కంటైనర్లలో విదేశాలకు తరలిస్తున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే కడప, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఉన్న ఎర్రచందనాన్ని తరలించడానికి తరచూ అంతర్జాతీయ స్మగ్లర్లు ఇటువైపు కన్నేసినట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక స్మగ్లర్లు పట్టుబడినపుడు వారి ద్వారా అంతర్జాతీయ స్మగ్లర్లను పట్టుకోవడానికి పోలీసుశాఖ చర్యలు చేపడుతోంది. కొందరు పట్టుబడుతున్నా... మరికొందరు తప్పించుకు తిరుగుతున్నారు.

పీడీ యాక్ట్ నమోదు

ఇప్పటివరకు కడప జిల్లాలోని పోలీసు రికార్డుల్లో 2014 నుంచి 2018 వరకు దాదాపు 50 మంది బడా స్మగ్లర్లు పట్టుబడినట్లు తేలింది. వారి అనుచరులు వందలమంది పోలీసులకు చిక్కారు. వారిలో కొందరు జైలు జీవితం గడిపి.... విడుదలై స్వరాష్ట్రాల్లో తలదాచుకుంటూ చాపకింద నీరులా మళ్లీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో కొందరు గతంలో పట్టుబడగా... మరికొందరు ఇంకా పోలీసుల చేతికి చిక్కలేదు. తాజాగా బాషాభాయ్.. పట్టుబడిన నేపథ్యంలో మిగిలిన బడా స్మగ్లర్లను పట్టుకోవడానికి పోలీసుశాఖ కసరత్తు చేస్తోంది. బడా స్మగ్లర్లలో చైనా, జైపూర్, దిల్లీ, చెన్నై, కర్నాటక, మలేషియా, దుబాయ్, కడప ప్రాంతాలకు చెందిన వారున్నారు.

ఎర్రచందనం కొల్లగొడుతున్న స్మగ్లర్లపై పోలీసులు పీడీయాక్టు కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఒక్కో నిందితుడిపై నాలుగు కేసులకు పైగా నమోదైతే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయడానికి పోలీసుశాఖ చర్యలు చేపడుతోంది. ఈ లెక్కన 2014 నుంచి 2018 వరకు 68 మంది స్మగ్లర్లపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. కానీ 2019, 2020లో ఇప్పటివరకు పీడీ చట్టం కింద కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. తాజాగా బాషాభాయ్ అరెస్ట్ నేపథ్యంలో అతనితోపాటు ప్రొద్దుటూరుకు చెందిన ఇద్దరు స్మగ్లర్లపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయడానికి చర్యలు చేపట్టారు. పీడీ చట్టం కింద కేసులు నమోదైన వారు కూడా ఏడాది పాటు జైలు జీవితం గడిపి తర్వాత విడుదలై తమ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఓటీటీలపై ఇక కేంద్రం పర్యవేక్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.