ETV Bharat / state

Achanna murder: "మృతదేహం మా నాన్నదో కాదో అనుమానంగా ఉంది" : అచ్చన్న కుమారుడు క్లింటన్ - AP Latest News

Achanna murder case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కడప పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ అచ్చన్న హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఇప్పుడు తాజాగా అచ్చన్న కుమారుడికి వచ్చిన సందేహంతో కేసులో కొత్త కోణాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి.

Achanna murder
Achanna murder
author img

By

Published : Apr 24, 2023, 10:58 AM IST

Updated : Apr 24, 2023, 12:01 PM IST

Achanna murder case: కడప పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ అచ్చన్న హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. మృతదేహం తన తండ్రిదో.. కాదో అని అతని కుమారుడు క్లింటన్ చక్రవర్తి అనుమానం వ్యక్తం చేయడంతో.. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కోర్టు అనుమతి తీసుకుని అచ్చన్న కుమారుడు, కుమార్తె రక్త నమూనాలను సేకరించి హైదరాబాదులోని కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపించారు. రాష్ట్రానికి చెందిన ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపిస్తే లేనిపోని అనుమానాలు వస్తాయని ఉద్దేశంతో విచారణ పక్కాగా జరగాలని పోలీసులు కేంద్రానికి చెందిన ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపించారు. మృతదేహం పక్కాగా అచ్చన్నదేనని పోలీసులు ధృవీకరించారు.. అయినప్పటికీ అతని కుమారుడు అనుమానం ఉందని చెప్పడంతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలని ఉద్దేశంతో రక్త నమూనాలను సేకరించినట్లు పోలీసులు చెప్పారు.

అచ్చెన్న ఎవరిపై అయితే ఫిర్యాదు చేశారో.. అలానే అచ్చెన్న కుమారుడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన వారందరికీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇదివరకే అచ్చన్న హత్య కేసులో అదే శాఖలో పనిచేస్తున్న సుభాష్ చంద్రబోస్ అనే ఉద్యోగితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరి కొంతమంది ఉద్యోగులపై అనుమానం ఉందని అచ్చన్న కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ రాగానే దర్యాప్తును మరింత వేగవంతం చేస్తామని పోలీసులు చెప్పారు.

ఇదీ జరిగింది.. పశువైద్యశాలలో పనిచేసే ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్లు సురేంద్రనాథ్ బెనర్జీ, శ్రీధర్ లింగారెడ్డి, సుభాష్ చంద్రబోస్ ను డీడీ అచ్చెన్న గత డిసెంబరులో ప్రభుత్వానికి సరెండర్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నారని పేర్కొంటూ సరెండర్ చేశారు. ఉన్నతాధికారులు తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆదేశించినా అచ్చెన్న ససేమిరా అన్నారు. దీనిపై పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ త్రిసభ్య కమిటీ వేసి విచారణ చేసినా పట్టించుకోలేదు. జీతాలు రాకుండా తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని భావించిన అసిస్టెంట్ డైరెక్టర్ సుభాష్ చంద్రబోస్.. డీడీ అచ్చెన్న హత్యకు కుట్ర పన్నాడు.

ఈ నెల 10న పోరుమామిళ్ల లాడ్జ్​లో కలసపాడుకు చెందిన చెన్నకృష్ణ, గుర్రంకొండకు చెందిన బాలాజీనాయక్ కలిసి పథక రచన చేశారు. 11వ తేదీ ముగ్గురూ కడపకు వచ్చి చంద్రబోస్ ఇంట్లోనే బస చేశారు. ఈనెల 12వ తేదీ ఉదయం 11.30 గంటలకు డీడీ అచ్చెన్న పశువైద్య కార్యాలయం ఎదురుగా ఉన్న సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు ముగించుకుని బయటికి రాగానే ముగ్గురు వ్యక్తులు ఆయన్ని కిడ్నాప్ చేశారు. కారులో అచ్చెన్నకు మద్యం తాగించడంతో పాటు.. వారు కూడా మద్యం సేవించారు. ఈ విధంగా రామాపురం మండలం గువ్వల చెరువు ఘాట్ వద్దకు తీసుకెళ్లి కొట్టి చంపారని ఎస్పీ అన్బురాజన్ మీడియాకు వెల్లడించారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 24, 2023, 12:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.