కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కడప జిల్లా రాయచోటిలో లాక్డౌన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. కర్ఫ్యూ కారణంగా రోడ్లపైకి వాహనాలతో వచ్చిన వారిపై లాఠీఛార్జీ చేస్తున్నారు. రహదారులపైకి ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నారు. వాహనాల అద్దాలు, ఇతర పరికరాలను ధ్వంసం చేసి ఇంటికి పంపిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప.. ఎట్టి పరిస్థితుల్లోనూ జనం ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు వీలు లేదని హెచ్చరికలు జారీ చేశారు.
ఇదీ చదవండి: