కడప జిల్లా పోలీసు మైదానంలో పోలీసులు సంప్రదాయ దుస్తులు ధరించి సంక్రాంతి సంబరాలు చేశారు. మైదానమంతా రంగవల్లులతో అందంగా తీర్చిదిద్దారు. ఎద్దుల బండి, గంగిరెద్దు, భోగిమంటలను మైదాన ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. పోలీసులు నృత్యాలు చేసి అందరినీ అలరించారు. పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి ఎస్పీ బహుమతులు అందజేశారు.
ఇవీ చూడండి: