కడప జిల్లా మద్దిమడుగు సుగాలిబిడికి సమీపంలోని 7 వేర్వేరు నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు డీఎస్పీ, సీఐ, ఎస్సైల ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. సుమారు 1,670 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. అనంతరం గ్రామస్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. నాటుసారా తయారీ చట్టవిరుద్ధమని.. ఇక నుంచి దానికి దూరంగా ఉంటామని గ్రామస్థులు చేత పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు.
ఇవీ చదవండి.. బోరు కొడుతుందని పేకాట.. ఇద్దరి నిర్లక్ష్యంతో 39 మందికి పాజిటివ్