TDP Woman Leaders Arrest: తెలుగుదేశం నేతల అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి అరెస్ట్ మరువక ముందే వైయస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా మహిళా నేత లక్ష్మీనారాయణమ్మను, ఆమె భర్త, కుమార్తెను పోలీసులు అరెస్ట్‌చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆమెను రిమాండ్‌కు అప్పగించాలని కోరగా.. న్యాయస్థానం తిరస్కరించింది. మహిళా నేత కోర్టు నుంచి బయటకు రాగానే పోలీసులు మరో కేసులో ఆమెను అరెస్ట్ చేయడం విశేషం. డ్వాక్రా సొమ్ములు లక్ష్మీనారాయణమ్మ కుమార్తె స్వాహా చేశారంటూ పలువురుు.. ఇటీవల లక్ష్మీనారాయణమ్మ ఇంటిముందు ఆందోళన చేయగా, వారిపై దాడి చేశారంటూ లక్ష్మీనారాయణమ్మ దంపతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కోర్టు రిమాండ్ తిరస్కరించింది. సొమ్ముల స్వాహా కేసులో లక్ష్మీనారాయణమ్మ కుమార్తెకు మాత్రం రిమాండ్ విధించింది.
ఇవీ చదవండి: