కడప జిల్లా మైదుకూరు మండలం గంజికుంట ఎగువ భాగంలో ని నల్లమల అటవీ ప్రాంతంలోని చెలిమి బావి వద్ద బ్రహ్మంగారి మఠం మండలానికి చెందిన నలుగురు స్మగ్లర్లను వనిపెంట అటవీ క్షేత్ర అధికారులు అరెస్టు చేశారు. వీరి వద్దనుండి ముప్పైఏడు ఎర్రచందనదుంగలను,మూడు బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమరవాణాపై సమాచారం అందుకోవడంతతో తనిఖీలు నిర్వహించగా, పదకొండు మంది స్మగ్లర్లు పారిపోయే ప్రయత్నం చేయగా నలుగురిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసారు. వారిని విచారణ నిమిత్తం కోర్టులో హాజరుపరుచనున్నారు.
ఇదిచూడండి.రాజీవ్ హత్యకేసు నిందితురాలు నళిని విడుదల