రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతున్న క్రమంలో కడప జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో ఉన్న మూడు వేల ఆరు వందల ఆలయాలపై పోలీసులు, దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. 20 లక్షల రూపాయలకు పైగా ఆదాయం వస్తున్న గుడులకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
పోలీసులు ప్రతిరోజు రాత్రి ఆలయాల వద్దకు వెళ్లి అక్కడ ఉన్న నిర్వాహకులతో మాట్లాడుతున్నారు. దేవుని కడప, ఒంటిమిట్ట ఆలయాలు, కడప పెద్ద దర్గా, వీటితోపాటు పలు ఆలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఇదీ చదవండి: