ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుమేరకు నేటి నుంచి కడప భాజపా కార్యాలయంలో ప్లాస్టిక్ వాడకంపై నిషేధం పాటిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. ఈ నెల 17న మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు చేయబోతున్నట్లు వెల్లడించారు. ప్లాస్టిక్ వాడకంతో మానవాళి వినాశనానికి చేరువు అవుతున్నామని, ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ పై వ్యతిరేకత వస్తోందని ఆయన చెప్పారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, స్వఛ్చభారత్ కోసం కృషి చేద్దామని శ్రీనాథ్ రెడ్డి అన్నారు.
ఇదీ చూడండి