తాగిన మైకంలో ప్రమాదవశాత్తు 100 అడుగుల నీరులేని బావిలో పడి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలో జరిగింది. కడపకు చెందిన కిషోర్ నాయక్, అయోధ్యరామయ్యలు పని నిమిత్తం చింతకొమ్మదిన్నె మండలానికి వచ్చారు. అనంతరం దగ్గరలోని వైన్ షాపు వద్ద మద్యం తీసుకొని సమీపంలో ఉన్న బావి వద్ద కూర్చొని మద్యం సేవించారు. కిషోర్నాయక్కు దాహం వేసి... బావిలో నీళ్లు ఉన్నాయనే ఉద్దేశంతో బావి వద్దకు వెళ్లాడు. తాగిన మైకంలో పైనుంచి బావిలో పడ్డాడు. ఈ ప్రమాదంలో అతని తలకు బలమై గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, సంబంధిత పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి అతని తాళ్ల సహాయంతో పైకి తీసుకువచ్చారు. వెంటనే చికిత్స నిమిత్తం అతన్ని రిమ్స్‌కు తరలించారు.
ఇదీ చదవండి :