కడప జిల్లా సుండుపల్లి మండలం నల్లప్పగారిపల్లెకు చెందిన నాగేశ్వరయ్య (40) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పంట పొలాల వద్ద ఉన్న విద్యుత్ స్తంభానికి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
మృతుడి భార్య జీవనాధారం కోసం కువైట్కు వెళ్లింది. ఆమె పంపే డబ్బులతో కొంతకాలం బాగానే గడిచినా...రానురాను భర్త చెడు అలవాట్లకు బానిసైపోయాడు. వృథా ఖర్చులు చేస్తున్నాడని దంపతుల మధ్య మాటలు తగ్గిపోయాయి. కుమార్తెను అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది. కొంతకాలంగా ఆయన మానసిక స్థితి బాగా లేకపోవడంతోనే జీవితంపై విరక్తి చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు..దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం.. పొలం వివాదమే కారణం