కడప శివారులో రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన నాగార్జునకు మూడు సంవత్సరాలు క్రితం వివాహం అయ్యింది. 6 నెలల పాప ఉంది. నాగార్జున చెడు అలవాట్లకు బానిస అయి అప్పులు చేశాడని కుటుంబసభ్యులు తెలిపారు. జీవితం పై విరక్తి చెంది రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుని భార్య, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి