పింఛన్లు తొలగించడంపై కడప జిల్లా ప్రొద్దుటూరులో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఆందోళనకు దిగారు. పెన్షన్ 3 వేలకు పెంచుతానని చెప్పిన ముఖ్యమంత్రి, 3 పైసలయినా పంపించలేదని వృద్ధులు ఎద్దేవా చేశారు. మా డబ్బు మాకివ్వటానికి మీకెందుకు నొప్పులని వారు ప్రశ్నించారు. మాకు రావాల్సిన డబ్బునే మాకు ఇవ్వమని అడుగుతున్నామనీ, మీ ఆస్తులు అడగటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలగించిన పింఛన్లు పునరుద్ధరించకపోతే మరోసారి అధికారంలోకి జగన్ ప్రభుత్వం రాదని వారు హెచ్చరించారు. పింఛనుదారులకు వెంటనే పెన్షన్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి డిమాండ్ చేశారు. రంగులు వేయటానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నారనీ, వృద్ధులకు ఇవ్వాల్సిన డబ్బును ఇవ్వటం లేదని మండిపడ్డారు.
ఇదీ చదవండి: