అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు ఉన్న అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ జంగాల శివశంకర్పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లికి చెందిన శివశంకర్పై జిల్లాలో 2014 నుంచి ఎర్రచందనం కేసులు ఉన్నాయన్నారు. తమిళనాడు నుంచి కూలీలను రప్పించి జిల్లాలో ఉన్న ఎర్రచందనం చెట్లను నరికించి.. వాటిని దుంగలుగా మార్చి తమిళనాడు, కర్ణాటక, ప్రాంతాలకు అక్రమ రవాణా చేసేవాడని వివరించారు. ఎర్రచందనం దుంగలను అంతర్జాతీయ స్మగ్లర్లకు అక్రమ రవాణా చేసిన నిందితుడిపై.. పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఎస్పీ కలెక్టర్ హరికిరణ్కు ప్రతిపాదనలు పంపారు. కలెక్టరు ఉత్తర్వులు జారీ చేయటంతో పీడీ యాక్ట్ నమోదు చేసి.. కడప కేంద్రకారాగారానికి తరలించినట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి...