Tulasi Reddy Comments:కడప జిల్లా వేంపల్లిలో తులసి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు ఇచ్చే పావలా వడ్డీ పథకం తీసివేయడం దారుణం అన్నారు. ప్రస్తుతం ఇస్తున్న సున్నా వడ్డీ పథకం.. లక్ష రూపాయల కంటే తక్కువ రుణం తీసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. ఇటువంటి రైతులు 10 శాతం మాత్రమే ఉన్నారు. 90 శాతం రైతులకు సున్నా వడ్డీ పథకం వర్తించడం లేదని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా సున్నా వడ్డీ పథకాన్ని 2 లక్షల రూపాయల వరకూ పెంచాలని డిమాండ్ చేశారు.
అదే విధంగా గతంలో ఉన్న పావలా వడ్డీ పథకాన్ని పునరుద్ధరించి... రెండు లక్షల రూపాయలు పైబడి రుణాలు తీసుకుంటున్న వారికీ వర్తింపచేయాలని అన్నారు. ప్రస్తుతం మహిళా సంఘానికి 3 లక్షల వరకూ రుణం తీసుకున్న వారికి మాత్రమే సున్నా వడ్డీ పథకం అమలు అవుతోంది. దాని పరిమితి 6 లక్షల రూపాయలకు పెంచాలని కోరారు.
"రైతుల పంట రుణాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సున్నా వడ్డీ పథకానికి సున్నం పెట్టింది. పావలా వడ్డీ పథకానికి పాడె కట్టింది. లక్షా పదివేల రూపాయల రుణం తీసుకున్నా మొత్తం వడ్డీ కట్టాలి. ప్రస్తుతం 10 శాతం మంది రైతులు మాత్రమే లక్ష రూపాయల కంటే తక్కువ రుణం తీసుకుంటున్నారు. మిగిలిన 90 శాతం మంది రైతులకు.. ఇటు సున్నా వడ్డీ పథకం లేదు.. అటు పావలా వడ్డీ పథకం కూడా లేదు. కాబట్టి సున్నా వడ్డీ పథకాన్ని 2 లక్షల రూపాయల వరకూ.. పావలా వడ్డీ పథకాన్ని 2 లక్షల నుంచి 6 లక్షల రూపాయల వరకూ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం".- తులసి రెడ్డి, పీసీసీ మీడియా చైర్మన్
ఇవీ చదవండి: