ETV Bharat / state

యురేనియంపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి: అఖిలపక్షం - cm jagan

కడపజిల్లా వేముల మండలం తుమ్మలపల్లి యురేనియం కర్మాగారం అనర్థాలపై తీవ్ర దుమారం రేగుతోంది. మూడేళ్ల నుంచి బాధిత గ్రామస్థులు యురేనియం కాలుష్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టినా యూసీఐఎల్ అధికారులు స్పందించటం లేదు. కాలుష్యం పర్యవసానాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చేవరకు పోరాటం చేయాలని అఖిలపక్షం నిర్ణయించింది. యురేనియం కార్మాగారాన్ని మూసేయాలని ముఖ్యమంత్రి అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేసింది.

యురేనియం
author img

By

Published : Sep 21, 2019, 11:27 PM IST

కడపలో అఖిలపక్షభేటీ

కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లి యురేనియం కర్మాగారం నుంచి వెలువడే విష వాయువులను నియంత్రించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అఖిలపక్ష సభ్యులు అన్నారు. కడప డీసీసీబీ కార్యాలయంలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో యురేనియం అనర్థాలకు వ్యతిరేకంగా ఇవాళ అఖిలపక్షం సమావేశం నిర్వహించారు. వైకాపా మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, యురేనియం బాధిత గ్రామాల ప్రజలతో పాటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హాజరయ్యారు. ప్రభుత్వం నియమించిన కమిటీ నామమాత్రంగానే బాధిత గ్రామాల్లో పర్యటించిందని ప్రజలకు ఎలాంటి న్యాయం జరగడం లేదని విపక్షాలు మండిపడ్డాయి. బాధిత గ్రామాల ప్రజల ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చూపాలన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. విశాఖలోని బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తుమ్మలపల్లిలో కూడా నిర్ణయం తీసుకోవాలని అఖిలపక్షం అభిప్రాయపడింది. ఈమేరకు అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేయాలని సూచించింది.

ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు
అభివృద్ధి జరుగుతుందని పరిశ్రమ ఏర్పాటుకు అంగీకరించినందుకు విషతుల్యమైన కాలుష్యంతో రోగాల బారిన పడుతున్నామని బాధిత గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. యురేనియం కర్మాగారానికి వ్యతిరేకంగా మాట్లాడితే స్థానికంగా గ్రామస్థులకు రాజకీయ నాయకుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమావేశంలో ప్రస్తావించారు. కాగా తుమ్మలపల్లి యురేనియం బాధిత ఏడు గ్రామాలకు చిత్రావతి నుంచి పైపు లైను ద్వారా మంచినీటిని తీసుకురావాలనే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రెండు రోజుల కిందట పచ్చజెండా ఊపినట్లు సమాచారం.

యురేనియంపై తెలంగాణ అఖిలపక్షం పోరు బాట

ఊరు ఊపిరికి..'ఉరే'నియం

యురేనియం...పర్యావరణానికి పెను ప్రమాదం

Intro:ap_knl_82_21_gurajadajayanthi_ryaali_vo_AP10132
మహిళలకు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా మగవారితో పాటు సమాన అవకాశాలు కల్పించిన అప్పుడే అణచివేతలు అవుతాయని ఐద్వా డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ సంఘాల నాయకులు అన్నారు.

Body:గురజాడ అప్పారావు 157 వ జయంతిని పురస్కరించుకుని ఆలూరు పట్టణం లో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు . కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరి పట్టణంలో చెక్ పోస్ట్ వరకు ఈ ర్యాలీని కొనసాగించారు.

Conclusion:మహిళలను రక్షించాల్సిన చట్టాలు రాజకీయ నాయకులకు చుట్టాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు న్యాయం జరగడం లేదని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను మహిళలకు అందించడం లేదని ఆవేదన చెందారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.