ఆక్సిజన్ కొరత వల్ల కొవిడ్ బాధితులు మృతి చెందుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రాణవాయువును తెప్పిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్‌కు ఉన్న డిమాండ్ వల్ల పోలీసు బందోబస్తు నడుమ కడప సర్వజన ఆస్పత్రికి ప్రాణవాయువును తరలించారు. కర్ణాటకలోని జిందాల్ కర్మాగారం నుంచి కడపకు ట్యాంకర్లో ఆక్సిజన్ తెప్పించారు.
ఎస్పీ అన్బురాజన్ ప్రత్యేక చొరవతో దారిలో ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకున్నారు. కర్ణాటక నుంచి కడపకు రావాలంటే 9 గంటల సమయం పడుతుంది. అలాంటిది కట్టుదిట్టమైన భద్రతా చర్యల వల్ల 6 గంటల్లో కడప ఆస్పత్రికి ఆక్సిజన్ చేరుకుంది. బాధితులు.. వారి బంధువులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: