కడప జిల్లా వ్యాప్తంగా కురిసిన గాలివానకు ఉద్యాన రైతులు భారీగా నష్టపోయినట్లు అధికారులు తెలిపారు. మామిడి, అరటి, చీనీ, నిమ్మ తోటలు దెబ్బతిన్నాయి. రాయచోటి, కోడూరు, రాజంపేట, పులివెందుల నియోజకవర్గాల పరిధిలో 17 మండలాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. వెయ్యి ఎకరాల్లో 1522 మంది రైతులకు సంబంధించి... 15 కోట్ల రూపాయల నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి