కడప కోటిరెడ్డి కూడలి వద్ద ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని ఎస్పీ అన్బురాజన్ జెండా ఊపి ప్రారంభించారు. వారం రోజుల పాటు ప్రత్యేక బృందాలు నగరం మొత్తం తిరుగుతాయని చెప్పారు.
బాలకార్మికులకు విముక్తి కల్పిస్తామన్నారు. చదువుకోవాల్సిన వయస్సులో పనులు చేస్తున్న మైనర్లందరినీ అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. కరోనా సమయంలో పిల్లలను సురక్షితంగా ఉంచాలనే ఉద్దేశంతో.. సీఎం, డీజీపీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
ఇవీ చదవండి: