ETV Bharat / state

కొండెక్కుతున్న ఉల్లి ధరలు.. సామాన్యులకు కన్నీళ్లు - ఉల్లి ధరలపై వార్తలు

ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. రోజురోజుకూ ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మొన్నటి వరకు కిలో ఉల్లి రూ.20 ఉండగా రూ.40కి చేరింది. కూరగాయల ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. సామాన్యుడు ఏమి కొనాలన్నా భారంగా మారింది.

onion rates increasing
కొండెక్కుతున్న ఉల్లి ధరలు
author img

By

Published : Oct 20, 2020, 3:15 PM IST

రోజురోజుకూ ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కడప రైతు బజార్​లో చిన్న సైజు ఉల్లి కిలో రూ.40 కి ఇస్తున్నారు. మరి కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే రూ.70 నుంచి రూ.80 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు.

నిన్నటి వరకూ ఉల్లి ధరలు అందుబాటులోనే ఉన్నాయి. అయితే ఇటీవలి వర్షాలకు ఉల్లి పంట ధ్వంసమైంది. మార్కెట్లోకి కొత్త సరకు రావడం లేదు. స్టాక్‌ తక్కువగా ఉండటంతో ఉల్లికి డిమాండ్ పెరిగింది. ఫలితంగా ధర కూడా పెరిగిందంటున్నారు ఉల్లి వ్యాపారులు. ధర ఇలా పెరుగుతూపోతే ఉల్లిగడ్డలు కొనలేం అంటున్నారు ప్రజలు.

రాయలసీమలో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. దీంతో వేల ఎకరాల్లో ఉల్లి పంట నాశనమై రైతులు నష్టపోతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చే పంట కూడా వర్షాలకు పాడైపోయింది. వర్షాలు ఇలాగే కొనసాగితే ఉల్లి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు.

ఇదీ చదవండి: బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో మూడు రోజులు వర్షాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.