కడప జిల్లా మైదుకూరు-ప్రొద్దుటూరు బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం-లారీ ఢీకొన్న ఘటనలో కొత్తపల్లికి చెందిన మహబూబ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరూ గాయపడ్డారు. మైదుకూరులో బంధువుల వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను ప్రొద్దుటూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.