తన వల్ల తన కుటుంబసభ్యులకు సైతం కరోనా సోకి ఉంటుందనే అనుమానమో... కరోనా భయంతోనో.. ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన కడప జిల్లా కమలాపురం మండలం సీ రాజుపాలెం గ్రామంలో జరిగింది.
గ్రామానికి చెందిన ఓ యువకుడు 3 రోజుల క్రితం కొవిడ్ టెస్టులు చేయించుకోగా.. పాజిటివ్‌గా వచ్చిందని అధికారులు నిర్థరించారు. దీంతో యువకుడుని హోంఐసోలేషన్లో ఉండమని వైద్యుులు సూచించారు. బాధితుడి ప్రైమరీ కాంటాక్టు అయిన కుటుంబ సభ్యులు కరోనా టెస్టులు చేయించుకునేందుకు కమలాపురం వెళ్లారు. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాధితుడు.. కరోనా సోకిందనో... తన వల్ల కుటుంబ సభ్యులకు సోకి ఉంటుందనే అనుమానంతోనో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమచారం అందుకున్న అధికారులు కేసు విచారిస్తున్నారు.
ఇదీ చదవండి: 'జేసీకి ఆరోగ్యం బాగాలేదు.. మమ్మల్ని చూడనివ్వండి'