పట్టుమని రెండేళ్లు కూడా నిండలేదు.. అన్ని కూరగాయలను ఇట్టే గుర్తుపట్టేస్తాడు. పక్షుల కూతలు, జంతువుల అరుపులను అనుకరిస్తాడు.. శరీర అవయవాల పేర్లు చెప్పాగానే వెంటనే చూపిస్తాడు... ఏడాది పది నెలల బాలడు ఇలా చేయడం విడ్డూరంగా ఉంది కదా!
కడప నగరానికి చెందిన పవిత్ర, లక్ష్మీకాంత్ దంపతులకు 2019 మే 24న శివ జషీత్ జన్మించాడు. చిన్నప్పటి నుంచి వయస్సుకు మించిన సామర్థ్యం ప్రదర్శిస్తుండటాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. అంతర్జాలంలో దృశ్యమాలిక (వీడియో) ద్వారా ఈ ఏడాది మార్చి 12న నిర్వహించిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డు కార్యక్రమంలో శివ జషీత్ ను బరిలో నిలిపారు. పక్షుల అరుపులు, వస్తువులు, వాహనాలు, పండ్లు, కూరగాయలు, జంతువులు, రంగులు, శరీర అవయవాల పేర్లు, పద్యాలతో కూడిన నృత్యం, ఆంగ్ల అక్షరాలను తెలపడంలోనూ విశేష ప్రతిభ కనబరిచాడు. ఏడాది పది నెలల వయసులోనే ఇలా సత్తా చాటడాన్ని గుర్తించిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు పతకం, ప్రశంసా పత్రాన్ని పంపినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: