ETV Bharat / state

కరోనా చికిత్సకు అధిక ఫీజులు.. ప్రైవేటు వైద్య సేవలపై అధికారుల నిఘా - private hospitals fees for corona treatment

ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్య సేవలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్​ ఆస్పత్రులలో అధికారులు తనిఖీలు చేపట్టారు. కరోనా చికిత్సకు అధికంగా ఫీజు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకున్నారు.

official monitoring on private hospital fees in Andhra pradesh
ప్రైవేటు వైద్య సేవలపై అధికారుల నిఘా
author img

By

Published : Apr 23, 2021, 10:16 AM IST

కొవిడ్ రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కడపలో కరోనా చికిత్స అందిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేసిన జేసీ సాయికాంత్ వర్మ .. రోగులతో నేరుగా మాట్లాడారు. బాధితుల నుంచి లక్ష రూపాయల డిపాజిట్‌ చేయించుకుని, మందుల కోసం అదనంగా మరో రూ.55 వేలు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. జేసీ ఆ వివరాలను కలెక్టర్‌కు తెలియజేశారు. స్పందించిన కలెక్టర్‌ రెండు ప్రైవేట్‌ ఆసుపత్రులకు రూ.5 లక్షల చొప్పున జరిమానా విధించారు. ఆరోగ్యశ్రీలో అడ్మిట్‌ పొందిన రోగుల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే 2005 చట్టం ప్రకారం సంబంధిత ఆసుపత్రుల యాజమాన్యంపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

గుంటూరు జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్య సేవలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ విజిలెన్స్‌ అధికారులు రంగంలోకి దిగారు. జిల్లాలో అనుమతి పొందిన ఆరోగ్యశ్రీ ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆస్పత్రులు, నాన్‌-ఆరోగ్యశ్రీ ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యసేవల తీరుపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అధికారులు నేరుగా దృష్టి సారించారు.

ఆస్పత్రుల బిల్లులు, అవి అందించే విధానాలను పరిశీలిస్తున్నారు. అసలు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను ఎలా చేపడుతున్నారు? వీటిని కేసు షీట్లలో ఎలా నమోదు చేస్తున్నారు? వారికి కల్పిస్తున్న సదుపాయాలేంటి? వారు వసూలు చేస్తున్న రుసుం ఏ ఆస్పత్రుల్లో ఎలా వసూలు చేస్తున్నారన్న విషయాన్ని విజిలెన్స్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. మార్కెట్లో ఖరీదైన వ్యవహారంగా మారిన రెమ్‌డెసివిర్‌ వంటి మందుల వినియోగంపైనా, వీటిని ఎలా సమకూర్చుకుంటున్నారనే విషయం పైనా అధికారులు నిశితంగా పరిశీలించనున్నట్లు సమాచారం. రోగులు, బంధువులు చెల్లిస్తున్న మొత్తం అధికారికంగా నమోదవుతుందా? లేదా మూడో వ్యక్తి పేరున డబ్బులు పేమెంట్‌ చేస్తున్నారా? అలా అయితే ఇవి ఎవరి ఖాతాల్లోకి వెళ్తున్నాయనే విషయాన్ని ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి: గుంటూరు జిల్లా చింతలపూడిలో ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.