ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ , కాపు, బ్రాహ్మణ, క్రిస్టియన్ కార్పొరేషన్ల నుంచి వచ్చే నిధులను వాహనమిత్రకు మళ్లించారని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి ఆరోపించారు. కార్పొరేషన్ నుంచి నిధులు మళ్లించకుండా రాష్ట్ర బడ్జెట్ నుంచి నగదు కేటాయించి... వాహన మిత్రకు ఇవ్వాలని అన్నారు. వాహన మిత్రకు, అమ్మ ఒడికి సంబంధించి ఇంకా నాలుగు లక్షల మంది లబ్ధిదారులు అనర్హులుగా ఉన్నారని చెప్పారు. వాహన మిత్ర ఓనర్లకే కాకుండా డ్రైవర్లకూ వర్తించాలని కాంగ్రెస్ పార్టీ తరుపున డిమాండ్ చేశారు. రంగులపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని.... నా ఇష్టం నా రాష్ట్రం అంటే కుదరదని మండిపడ్డారు. రాజ్యాంగ పరంగా... చట్ట ప్రకారం పరిపాలన సాగించాలని సూచించారు. భవిష్యత్తులోనైనా ఒక జీవో ఇచ్చేముందు చట్ట పరిధిలో ఉందా లేదా అన్న విషయం తెలుసుకొని పరిపాలన కొనసాగించాలని తెలిపారు.
ఇదీ చదవండి: పథకాల అమల్లో వివక్ష ఉండకూడదు: సీఎం జగన్