ETV Bharat / state

పల్లె పోరులో నిర్వాసితులకు దక్కని హక్కు - kadapa district news update

ఓట్ల పండగ వచ్చింది. ఊరూరా సందడి మోసుకొచ్చింది. మన తలరాతల్ని మార్చుకునే అవకాశం పల్లెపోరు తీసుకొచ్చింది. అయితే సోమశిల నిర్వాసితులు సంగ్రామంలో ఓటేయాలని ఆశించినవారికి భంగపాటే ఎదురైంది. సార్వత్రిక సమరంలో ఓటేసినా పంచాయతీలో ఓటు వేసే వీలు లేదంటూ పక్కన పెట్టేశారు. అధికారుల తీరుతో కడప జిల్లాలో సోమశిల ముంపు గ్రామాల నిర్వాసితులు ఆక్రోశిస్తున్నారు.

పల్లె పోరులో నిర్వాసితులకు దక్కని హక్కు
పల్లె పోరులో నిర్వాసితులకు దక్కని హక్కు
author img

By

Published : Jan 30, 2021, 5:55 PM IST

రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల హడావిడి మెుదలైంది. పల్లె పోరులో ఓటు హక్కు వినియోగించుకుని... భవిష్యత్తును బాగు చేసుకోవాలనుకున్న వారికి మాత్రం నిరాసే మిగిలింది. కడప జిల్లాలోని ఒంటిమిట్ట మండలం పరిధిలోని సోమశిల ముంపు గ్రామాల ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసినా... స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వారికి అవకాశం ఇవ్వట్లేదు.

ఇదీ పరిస్థితి...

కుడమలూరు, బేస్తపల్లి, బందారుపల్లి గ్రామాలు సోమశిల జలాశయం నిర్మాణంతో మునకలో చేరాయి. ఇప్పటికే కొంతమంది తమ స్వగ్రామాలను ఖాళీ చేశారు. కొంతమంది ఇప్పటికీ అక్కడే నివాసం ఉంటున్నారు. పోలింగ్‌ కేంద్రం-41లో వీరికి ఓటుహక్కు కల్పించారు. మహిళలు 160, పురుషులు 172 మంది ఉన్నారు. రెండు దశాబ్దాలుగా శాసనసభ, లోక్‌సభకు జరిగే సార్వత్రిక ఎన్నికల వేళ అధికారులు ఓటుహక్కు కల్పించినా స్థానిక ఎన్నికలు వచ్చినప్పుడు పక్కన పెట్టేస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ ముంపు గ్రామాల నిర్వాసితుల కోసం కుడమలూరులో పోలింగ్‌ కేంద్రం (41) ఏర్పాటు చేశారు. 2019 ఏప్రిల్‌ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 334 ఓట్లు ఉండగా, 304 మంది (91.01 శాతం) పోటెత్తి ముందుకొచ్చి ఓటుహక్కును వినియోగించుకున్నారు.

అభ్యర్థించినా నిరాకరణ...

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేసే అవకాశం కల్పించాలని ముంపు గ్రామాల బాధితులు అధికారులకు పలుమార్లు అభ్యర్థించారు. త్వరలోనే న్యాయం చేస్తామని చెప్పారు. కుడమలూరు, బేస్తపల్లి మంపు గ్రామాలను రాచగుడిపల్లె పంచాయతీలోకి విలీనం చేస్తే ఎలా ఉంటుందని ఆరా తీశారు. ఉన్నత స్థాయి అనుమతికి ఏడాది కిందటే ప్రతిపాదనలు పంపించారు. ముంపు వాసుల ఓటర్లను తమ పంచాయతీలోకి విలీనం చేయొద్దని రాచగుడిపల్లె వాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నేటికీ ఎలాంటి అధికారిక అనుమతి రాలేదు.

చేపల వేటే మాకు ఆధారం. శాసనసభ, లోకసభ ఎన్నికలకు ఓటు వేసేలా అవకాశం కల్పిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రం అనుమతి ఇవ్వలేదు.- వెంకటరమణ, కుడమలూరు

పల్లె పోరులో ఓటు హక్కు వినియోగానికి అనుమతి ఇవ్వట్లేదు. సమీప గ్రామంలోకి విలీనం చేయట్లేదు. పంచాయతీ ఎన్నికలకు దూరం పెట్టడం అన్యాయం.-మాధురి, బేస్తపల్లి

కుడమలూరు, బేస్తపల్లి ముంపు గ్రామాల్లోని వారికి సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వినియోగించుకునేలా అవకాశం కల్పిస్తున్నాం. ఈ గ్రామాలు మంపునకు గురి కావడంతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించట్లేదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇంకా ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదు.-జి.కృష్ణయ్య, ఎంపీడీవో, ఒంటిమిట్ట

ఇదీ చదవండి: స్థానిక ఎన్నికలు లేని తిరుమల పంచాయతీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.