కడప జిల్లా పెండ్లిమర్రి మండలం కోరవాండ్లపల్లి గ్రామానికి చెందిన నాగిరెడ్డి అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. నాగిరెడ్డి భార్య, కుమారుడు కరోనా సోకి ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. నాగిరెడ్డికి కూడా కరోనా ఉందనే అనుమానంతో ఇతర కుటుంబసభ్యులెవరూ అంత్యక్రియలకు హాజరవ్వలేదు. మానవతా దృక్పథంతో పెండ్లిమర్రి పంచాయతీ కార్యదర్శి సుధాకర్ మున్సిపల్ సిబ్బందితో అంత్యక్రియలు జరిపించారు.
ఇదీ చదవండి: