ETV Bharat / state

'తుమ్మలపల్లి యురేనియం కర్మాగార అణు వ్యర్థాల ప్రభావంపై నివేదిక ఇవ్వండి'

తుమ్మలపల్లి యురేనియం కర్మాగారం వ్యర్థాల నిర్వహణలో విఫలమైతే.... కలిగే పరిణామాలపై నివేదిక ఇవ్వాలని ముంబయి అణుశక్తి విభాగాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశించింది. కర్మాగారం నుంచి వెలువడే వ్యర్థాలు భూమిలోకి ఇంకకుండా టెయిల్‌పాండ్‌ కింద 250 మైక్రాన్‌ మందం కల్గిన పాలిథిన్‌ పొరను ఏర్పాటు చేయాలనే పట్టించుకోలేదంటూ ‘ఈనాడు’ పత్రికలో గతేడాది ఆగస్టు 21న ప్రచురితమైన కథనాన్ని ఎన్జీటీ దిల్లీ బెంచ్‌ సుమోటోగా స్వీకరించింది.

NGT
NGT
author img

By

Published : May 1, 2022, 6:01 AM IST

కడప జిల్లా తుమ్మలపల్లిలోని యురేనియం కర్మాగారం వ్యర్థాల నిర్వహణలో విఫలమైతే కలిగే పరిణామాలపై నివేదిక ఇవ్వాలని ముంబయిలోని అణుశక్తి విభాగాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశించింది. యురేనియం శుద్ధి కర్మాగారం నుంచి వెలువడే వ్యర్థాలు భూమిలోకి ఇంకకుండా టెయిల్‌పాండ్‌ కింద 250 మైక్రాన్‌ మందం కల్గిన పాలిథిన్‌ పొరను ఏర్పాటు చేయాలనే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలను కర్మాగార యాజమాన్యం పట్టించుకోలేదంటూ ‘ఈనాడు’ పత్రికలో గతేడాది ఆగస్టు 21న ప్రచురితమైన కథనాన్ని ఎన్జీటీ దిల్లీ బెంచ్‌ సుమోటోగా స్వీకరించింది. ఎన్జీటీ ఛైర్మన్‌ జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయల్‌, జస్టిస్‌ సుధీర్‌ అగర్వాల్‌, విషయ నిపుణుడు ప్రొఫెసర్‌ ఎ.సెంథిల్‌ వేల్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం దీనిపై విచారణ చేపట్టింది.

యాజమాన్య నిర్లక్ష్యంతో యురేనియం వ్యర్థాలు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు కలుషితమవడంతో పాటు నేలలు సారహీనమవుతున్నాయని, ప్రజలు చర్మ వ్యాధులతో బాధపడుతున్నారని ‘ఈనాడు’ కథనంలో పేర్కొన్నారు. వ్యర్థాల ప్రభావం రానున్న సంవత్సరాల్లో చూపించనున్న దుష్ఫలితాలను వివరించారు. కథనంలో పేర్కొన్న అంశాలపై ముంబయి అణుశక్తి విభాగం తమ అభిప్రాయాలు తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది. నెల రోజుల్లో తమ నివేదికను పీడీఎఫ్‌ రూపంలో ఎన్జీటీ మెయిల్‌కు పంపాలని అణుశక్తి విభాగానికి సూచించింది. కేసు తదుపరి విచారణను జులై 11వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: వైకాపాలో వర్గపోరు ... కొట్లాటల నుంచి హత్యల వరకు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.