కడప జిల్లాలోని వేంపల్లి మండలం టి వెలమవారిపల్లి పరిసరాల్లో భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోయింది. రాష్ట్రంలోనే ఆ గ్రామం గుర్తింపు పొందినా.. నీటి సమస్యను అధిగమించలేకపోతుంది. ప్రముఖుల ఊరు అయినా... ఎవరు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామస్తులకు నీరు అందించేందుకు నాలుగు పథకాలు ఉన్నాయి. వీటి కోసం 20 లక్షలు ట్యాంకులు ఏర్పాటు చేశారు. ఇంటింటికి కుళాయిలు కూడా ఉన్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలమట్టం పూర్తిగా ఎండిపోయింది. ప్రభుత్వం ప్రస్తుతం నీటి ట్యాంకులను సరఫరా చేస్తున్నా... ఆ నీరు సరిపోలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. నీటి ఎద్దడి కారణంగా ఎద్దులు, గేదెలు, ఆవులు అమ్ముకుంటున్నామని ప్రజలు వాపోతున్నారు. గ్రామంలోని నీటి సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి