మద్యం రేట్లు పెరగడంతో పల్లెల్లోని పేదవారు నాటుసారాను తాగేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో నాటుసారా తయారుచేసేవారు ఎక్కువయ్యారు. కడప జిల్లాలో ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు చేస్తుండగా... పుల్లంపేట మండలం వత్తలూరు రోడ్డు సమీపంలో నాటు సారా బట్టీలను గుర్తించారు. 15 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: కుక్కల దాడిలో జింక మృతి