ETV Bharat / state

అక్రమ మద్యం, శానిటైజర్ విక్రయాలపై పోలీసుల దాడులు - అక్రమ మద్యం, నాటుసారా, శానిటైజర్ విక్రయాల పై పోలీసుల దాడులు

కడప జిల్లా రైల్వే కోడూరులో పోలీసులు నాటుసారా, అక్రమ మద్యం కేంద్రాలపై దాడులు నిర్వహించారు. కోడూరు నుంచి చిట్వేలికి తరలిస్తున్న ఐదు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. బుడుగుంట పల్లె గ్రామంలో 300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

kadapa district
అక్రమ మద్యం, నాటుసారా, శానిటైజర్ విక్రయాల పై పోలీసుల దాడులు
author img

By

Published : Aug 5, 2020, 6:33 PM IST

కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో ఎస్ఈబీ ఇన్​స్పెక్టర్​ రామ మోహన్ సిబ్బందితో కలసి నాటుసారా అక్రమ మద్యంపై దాడులు నిర్వహించారు.

కోడూరు నుండి చిట్వేలికి వెళ్లే బస్సు మార్గంలో ఎస్సార్ పెట్రోల్ బంకు వద్ద ప్లాస్టిక్ క్యాన్ లో ఐదు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. కోడూరు మండలం గుండాలపల్లికి చెందిన బండ్ల బాలాజీ వద్ద వ్యక్తిని అరెస్ట్ చేశారు. మండలంలోని బుడుగుంట పల్లె గ్రామ సమీపంలోని కొండ ప్రాంతాలలో నాటు సారా తయారీ కేంద్రాలపై దాడులు చేశారు. నాలుగు డ్రమ్ములలో సుమారు 300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. యజమానుల కొరకు గాలింపు చేపట్టామని పోలీసులు తెలిపారు.

కోడూరు ఓబులవారిపల్లి, చిట్వేలి మండలాల్లో అనుమతి లేని హానికర శానిటైజర్ లు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మెడికల్ షాప్ నిర్వాహకులను హెచ్చరించారు. నాటుసారా , అక్రమ మద్యం , ఇసుక అక్రమ రవాణా ఎక్కడైనా శానిటైజర్ లు మద్యపానం కోసం వాడుతున్నట్లు తెలిస్తే ప్రజలు 9440902597 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి 108 వాహనాలకు షెడ్లు లేవు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.