ETV Bharat / state

అసంపూర్తిగా రహదారి పనులు.. వాహన చోదకుల అవస్థలు

author img

By

Published : Oct 2, 2020, 3:25 PM IST

కడప జిల్లాలో జాతీయ రహదారి అద్వానంగా తయారైంది. పనులు అసంపూర్తిగా జరగటంతో వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. కడప జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు ముంబై 67 జాతీయ రహదారిపై నిత్యం వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. ఓ పక్క రహదారి ఎత్తు ఉండటం, మరోపక్క తక్కువగా ఉండటం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.

national highway 67 at kadapa district in bad condition
కడపలో జాతీయ రహదారి అద్వనం

ఏళ్లు గడుస్తున్నా కడప జిల్లాలో జాతీయ రహదారి పనులు అసంపూర్తిగా ఉన్నాయి. నిత్యం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇందుకు నిదర్శనం కృష్ణపట్నం పోర్టు ముంబై 67 జాతీయ రహదారి. కడప జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు ముంబై 67 జాతీయ రహదారిపై నిత్యం బద్వేల్ మీదుగా వందల వాహనాలు ముంబయి నుంచి కృష్ణపట్నానికి తిరుగుతుంటాయి. బద్వేల్ నుంచి నెల్లూరుకు వెళ్లే ఈ మార్గంలో పెద్దపోలుకుంట అడవి ప్రాంతంలో రహదారి పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఓ పక్క రహదారి ఎత్తు ఉండటం , మరోపక్క తక్కువగా ఉండటం వల్ల వాహనచోదకులు గుర్తించలేక నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రాణాలను కోల్పోతున్నారు.

ఇంత జరుగుతున్నా ఎన్​హెచ్ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఈ రహదారి పనులు పూర్తిచేసి రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని విజ్ఞప్తులు చేసినా అధికారులు పట్టించుకోవటం లేదు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. రహదారి ఎగుడుదిగుడు ఉండటం వల్ల ప్రయాణం సాగించడం కష్టంగా ఉంటుంది. దీంతో సమయం వృథా అవడంతో పాటు వాహనాలు దెబ్బతింటున్నాయి.

national highway 67 at kadapa district in bad condition
అద్వనంగా కడపలో జాతీయ రహదారి

కడప జిల్లాలో 153 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారి అసంపూర్తిగా ఉండటంవల్ల దూర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బద్వేలు నాలుగురోడ్ల కూడలి విస్తరణ పనులు ఆగిపోయాయి. అలాగే పట్టణంలో సెంటర్ లైటింగ్ సిస్టం కూడా అలంకారప్రాయంగా మిగిలింది. ఇప్పటికైనా అసంపూర్తిగా ఉన్న 67 వ జాతీయ రహదారి పనులు పూర్తిచేసి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని వాహన చోదకులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: గిరిజనులకు భూపట్టాల పంపిణీ.. హామీ నిలబెట్టుకున్నామన్న సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.